జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో 94 మంది అభ్యర్థులని ప్రకటించారు ఈరోజు ప్రకటించిన అభ్యర్థులు లిస్ట్ లో పేర్లు లేని నాయకుల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. టిడిపి జనసేన తొలి జాబితాలో చోటు దక్కని టిడిపి నేతలు అసంతృప్తి వ్యక్తపరుస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఇందులో గజపతినగరం టిడిపి ఇన్చార్జ్ కొండపల్లి అప్పలనాయుడు రాజీనామా ని ప్రకటించారు.
అతను పోటీ చేయాలనుకున్న స్థానం నుండి కొండపల్లి శ్రీనివాసరావుకి టికెట్ ని కేటాయించారు. విశాఖపట్నం సీటు ఆశించిన పాసర్ల ప్రసాద్ కి దక్కక పోవడంతో టీడీపీకి రాజీనామా చేశారు. రాయచోటి నుండి పోటీలో నిలవాలని చూసిన రమేష్ రెడ్డి తొలి జాబితాలో చోటు దక్కకపోవడంతో ఆయన అనుచరులతో పాటుగా రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. మరి ఈరోజు లిస్టు తో ఇంకా ఎంతమంది రాజీనామా చేస్తారో చూడాలి