వనదేవతలను 1.35 కోట్ల మంది దర్శించుకున్నారు : మంత్రి సీతక్క

-

మేడారం మహా జాతర విజయవంతమైంది. నాలుగు రోజుల్లో కోటి నలభై లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. శనివారం రాత్రి వరకు మరింత పెరిగే అవకాశం ఉందని మంత్రి సీతక్క తెలిపారు. నేటితో మేడారం జాతర ముగియ నుండడంతో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. తక్కువ సమయంలోనే జాతరకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.

నిన్నటి వరకు 10వేల బస్ ట్రిప్పులు నడిచాయి. గుండె సమస్యతో వృద్ధురాలు, మరో యువతి జాతరలో మృత్యువాత పడ్డారని, మద్యం సేవించి జంపన్న వాగులో పడి ఓ వ్యక్తి మృతి చెందినట్లు వివరాలను వెల్లడించారు. చిన్న చిన్న ఘటనలు మినహా జాతర విజయవంతమైందన్నారు. అమ్మవార్ల వన ప్రవేశం కాసేపట్లో జరుగనుంది. వనప్రవేశం పూర్తయినా భక్తుల రద్దీ కొనసాగుతుందని చెప్పారు. రేపటి వరకు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని వివరించారు. 4వేల మంది పారిశుధ్య సిబ్బంది విధుల్లో ఉన్నారని పేర్కొన్నారు. జాతరకు నిధులిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, క్యాబినెట్ మంత్రులకు, సహకరించిన భక్తులకు ధన్యవాదాలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news