ఇండియాని ప్రపంచ అగ్రగామిగా నిలపాలన్నదే ప్రధాని మోడీ ధ్యేయం : డీకే అరుణ

-

భారత్ ని వివిధ రంగాల్లో ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలపాలని ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.కుల ,మతాలకు అతీతంగా అన్ని వర్గాల అభివృద్ధి , సంక్షేమాన్ని పెంపొందించడానికి ప్రధాని మోడీ కనబరుస్తున్న నిబద్ధతను మీడియాకు డీకే అరుణ వెల్లడించారు. కరోనా మహమ్మారి సమయంలో పారిశ్రామిక వృద్ధి , వ్యాక్సిన్ ఉత్పత్తిలో ఇండియా పురోగతిని అన్ని దేశాలకు తెలిసేలా హైలైట్ చేస్తూ, ఆర్థిక సమతుల్యత , వృద్ధిని నడిపించడంలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అరుణ ప్రశంసించారు.

ఇటీవలి బడ్జెట్‌లో పాలమూరు యూనివర్శిటీకి 20 కోట్ల నిధులు మంజూరు చేశారని అన్నారు. అంతేకాకుండా తెలంగాణ అభివృద్ధికి 10 లక్షల కోట్లతో సహా కేంద్ర ప్రభుత్వం గణనీయమైన పెట్టుబడులను అరుణ నొక్కిచెప్పారు. షాద్ నగర్‌లోని లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం జవాబుదారీతనం వహించాలని అంతేకాకుండా దాని పురోగతి , సాగునీటి ప్రణాళికలపై క్లారిటీ ఇవ్వాలని అరుణ డిమాండ్ చేశారు. పాలమూరు అభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలని సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరింది . అలాగే ప్రాజెక్టు కాంట్రాక్టుల్లో జరిగిన అవినీతిపై విచారణ జరపకపోవడము పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news