దర్శకుడు పూరి జగన్నాథ్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు పూరి జగన్నాథ్ మంచి పేరు తెచ్చుకున్నారు. దర్శకుడుగా పూరి జగన్నాథ్ 100 కోట్లకు పైగా డబ్బులు సంపాదించినా అది మొత్తాన్ని కూడా ఆయన పోగొట్టుకున్నారు. అయినా సరే అతను ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న కుక్కల్ని మెయింటైన్ చేయడానికి ఎంత ఖర్చైనా సరే పెట్టుకుంటున్నారు.
ఒకానొక టైంలో వాటి పోషణ భరించలేని సందర్భం వచ్చిందట దీంతో మనసుని చంపుకుని వాటిని వేరే తెలిసిన వాళ్ళకి ఇచ్చారట. ఎంత కష్టం వచ్చినా బాధ వచ్చినా సరే తట్టుకోవాలని నిర్ణయించుకుని తన కుక్కల్ని వేరే వాళ్ళకి ఇచ్చేశారట. ఆ క్షణం ఏడ్చినంత పూరి ఎప్పుడు ఏడవ లేదట అయితే మళ్ళీ పూరి జగన్నాథ్ మంచి ప్లేస్ లోకి రావడానికి ఐదేళ్ల సమయం పట్టిందట ఆ తర్వాత వెళ్లి తన కుక్కల్ని మళ్ళీ తిరిగి తెచ్చుకున్నారట