అమీట్ పేట్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ మోదీ మళ్ళీ ప్రధాని కావడం ఖాయం అని కిషన్ రెడ్డి అన్నారు. విజయ సంకల్ప యాత్ర పేరుతో రాష్ట్రంలో 5 యాత్రలను ప్రారంభించడం జరిగిందని చెప్పారు. ఈ రోజు విజయ సంకల్ప యాత్రలో భాగంగా సనత్ నగర్‌కు రావడం జరిగిందన్నారు.
ఎవరూ ప్రధాని కావాలి? ఏ ప్రభుత్వం కేంద్రంలో రావాలనేది ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయి అన్నారు. మూడో సారి మోడీ ప్రధాని కావాలని దేశ ప్రజలు అకాక్షింస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. మోడీ గారి పాలనలో అనేక సంస్కరణలు జరిగాయి అన్నారు. రాష్ట్రంలో కూడా బేగంపేట రైల్వే స్టెషన్ పునరుద్దరణ పనులకు మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు అని అన్నారు.