Radisson Drugs Case: రాడిసన్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ చెల్లి

-

రాడిసన్ డ్రగ్స్ కేసులో నిందితులు…పుట్టగొడుగుల్లా బయటకు వస్తున్నారు. ఇప్పటికే రాడిసన్ స్టార్ హోటల్లో డ్రగ్స్ కేసులో బీజేపీ నేత కుమారుడు అరెస్ట్‌ అయ్యాడు. నిన్న రాత్రి హైదరాబాద్ రాడిసన్ పబ్‌లో డ్రగ్స్‌తో శేరిలింగంపల్లి బీజేపీ నేత గజ్జల యోగానంద్ కుమారుడు మంజీర మాల్ ఓనర్ గజ్జల వివేకానంద్ పట్టుబడ్డాడు.

Lishi Ganesh in Radisson Drugs Case

రోశయ్య మనవడు కూడా ఉన్నాడట. ఇక అటు ఈ డ్రగ్స్ కేసులో మరోసారి మోడల్ లిషి గణేష్… పట్టుబడింది. రెండేళ్ల క్రితం రాడిసన్ హోటల్, మింక్ పబ్ డ్రగ్ కేసులో కల్లపు కుషిత, ఆమె సోదరి కల్లపు లిషి గణేష్ పట్టుబడగా.. లిషి గణేష్ ఈరోజు మరోసారి పట్టుబడింది. ఈ అక్కచెల్లెళ్ళు గతంలో డ్రగ్స్ కేసులో పట్టుబడిన సమయంలో మేము డ్రగ్స్ తీసుకోలేదు పార్టీకి వచ్చి చీజ్ బజ్జీలు మాత్రమే ఆర్డర్ ఇచ్చాము అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news