ప్రఖ్యాత నిర్మాత ఎమ్ ఎస్ రాజు దర్శకుడిగా మారి తెరకెక్కించిన డర్టీహరి సినిమాలో నటించిన రుహానీ శర్మ, సోషల్ మీడియాలో రచ్చ లేపుతుంది. చిలసౌ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన రుహానీ శర్మకి చెప్పుకోదగిన హిట్లు రాలేవనే చెప్పాలి.మొదటి సినిమా హిట్ అయినప్పటికీ, ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. గత ఏడాది హిట్ సినిమా పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకున్నప్పటికీ, అందులో ఆమె పాత్రకి పెద్దగా స్కోప్ లేకపోవడంతో ఆఫర్లు రాలేదు.
ఈ మధ్య డర్టీహరి సినిమాతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అటు సినిమా ద్వారా ఆకర్షిస్తూనే, సోషల్ మీడియాలో ఫోటోషూట్లతో మతి పోగొడుతుంది. తాజాగా అదిరిపోయే డ్రెస్‌లో మెరిసింది. అయితే..ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పరువపు అందాలని ప్రదర్శిస్తూ కుర్రవాళ్ళ గుండెల్లో సెగ పెడుతుంది. మత్తెక్కించే కళ్ళతో, గ్లామర్ ని ఒలకబోస్తూ ఇన్స్టాగ్రామ్ అనుచరులకి ఐ ఫీస్ట్ అందించింది.