గాజాలో 10కి.మీ సొరంగం ధ్వంసం చేసిన ఇజ్రాయెల్.. భారత్ ఆందోళన

-

హమాస్‌ మిలిటెంట్లను సమూలంగా నాశనం చేయాలన్న లక్ష్యంతో ఇజ్రాయెల్ దాడులకు తెగ బడుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా హమాస్ ఆయుపట్టుపై గట్టిదెబ్బ కొడుతోంది. గాజా పట్టీలో 10 కిలోమీటర్ల పొడవు ఉన్న భారీ సొరంగాన్ని ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ఈ దృశ్యాలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్- ఐడీఎఫ్​ విడుదల చేసింది. ఈ సొరంగం ఉత్తర, దక్షిణ గాజాను కలుపుతుందని, ఉత్తర గాజాలోని టర్కిష్ ఆస్పత్రి కింద నుంచి దక్షిణ గాజాలోని ఇస్రా వర్సిటీ వరకు సొరంగం విస్తరించి ఉన్నట్లు ఇజ్రాయెల్‌ దళాలు ఐడీఎఫ్ తెలిపింది.

ఇజ్రాయెల్ దళాలు గుర్తించిన భారీ సొరంగంలో హమాస్‌ మిలిటెంట్లు నిద్రపోవడానికి పడకలు, విద్యుత్ సదుపాయం, నీరు, మరుగుదొడ్లు సహా ఇతర సదుపాయాలున్నాయని ఇజ్రాయెల్‌ దళాలు తెలిపాయి. లోపల ఆయుధాలు, మందుగుండు సామగ్రి దాచుకోవడానికి హమాస్‌ తగిన ఏర్పాట్లు చేసుకున్నట్టు  వెల్లడించాయి. సొరంగంలో తనిఖీల సందర్భంగా కొన్ని మృతదేహాలను గుర్తించినట్టు తెలిపాయి. ఈ సొరంగాన్ని బాంబులతో పేల్చి వేసినట్లు పేర్కొన్నాయి. తమ సభ్యులు, ఆయుధాల తరలింపు కోసం హమాస్ ఈ సొరంగాన్ని వినియోగిస్తున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది.

ఇజ్రాయెల్​ దాడులతో గాజాలో ఏర్పడ్డ విధ్వంసం పట్ల భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మానవతా సంక్షోభానికి దారితీస్తున్న ఈ యుద్ధానికి స్థిరమైన పరిష్కారం అవసరమని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news