ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఏపీలో కాంగ్రెస్ గెలిస్తే ప్రతి నెలా, ప్రతి కుటుంబానికి రూ. 5000 ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు మల్లిఖార్జున ఖర్గే వెల్లడించారు. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ యూనివర్స్ బేసిక్ ఇన్కమ్ సపోర్ట్ పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి ప్రతి నెలా రూ.5,000 ఇస్తామని మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు.
ఇక అటు షర్మిల కూడా మాట్లాడుతూ… ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో అనంతపురంలో జరిగిన ‘న్యాయసాధన’ సభకు తరలివచ్చిన అశేష కార్యకర్తలకు, నాయకులకు, వైఎస్సార్ అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అవుతున్నా అభివృద్ధిలో పట్టుమని పది అడుగులు కూడా ముందుకు పడలేదన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీల విషయంలోనూ అటు టీడీపీ, ఇటు వైసీపీ.. రెండు పార్టీలు కేంద్రంలోని మోదీ సర్కార్‌కు సాగిలపడి వంగి మరి దండాలు పెట్టాయని..కానీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శ్రేయస్సు కోసం మోదీని ఎదిరించలేదని ఆగ్రహించారు.