ధోనీ, కోహ్లీ, రోహిత్ లకు డైలాగ్ డెడికేట్ చేసిన బాలయ్య.. వీడియో వైరల్

-

త్వరలోనే ఐపీఎల్ సందడి ప్రారంభం కానుంది. వచ్చే నెల 22 నుంచి ఐపీఎల్ తొలి దఫా మ్యాచులు షురూ కానున్నాయి. ఈ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ తెలుగు ప్రచార కార్యక్రమం మొదలెట్టింది. ఇందులో నందమూరి నటసింహం బాలకృష్ణ పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా బాలయ్య ఐపీఎల్ స్టార్ క్రికెటర్స్ను ఉద్దేశిస్తూ చెప్పారు. సీఎస్కే కెప్టెన్ ధోనీ, ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ముంబయి మాజీ ప్లేయర్ రోహిత్ శర్మ ఆటతీరును, బిహేవియర్ను ఉద్దేశిస్తూ వారికి తన సినిమాలోని డైలాగ్స్ను  డెడికేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సీఎస్కే కెప్టెన్ ధోనీ అనగానే – “డు నాట్ ట్రబుల్ ది ట్రబుల్. ఇఫ్ యు ట్రబుల్ ది ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యు. ఐ యామ్ నాట్ ది ట్రబుల్. ఐ యామ్ ది ట్రూత్” అని చెప్పారు. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ కోహ్లీ ఫైర్ బ్రాండ్ అని చెబుతూనే “నేను ఒకడికి ఎదురెళ్లినా వాడికే రిస్క్. ఒకడు నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్. తొక్కిపడేస్తా” అని కోహ్లీ గురించి చెప్పుకొచ్చారు. ఇక ముంబయి మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరు వినగానే – “ఫ్లూట్ జింక ముందు ఊదు. సింహం ముందు కాదు” అనే డైలాగ్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news