MLA లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో కీలక ఆధారాలు

-

BRS ఎమ్మెల్యే లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లాస్య నందిత స్పాట్లోనే చనిపోయారు. కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ఎమ్మెల్యే మృతదేహానికి పటాన్చెరువు ఏరియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించారు. అయితే ఆమె మృతికి ప్రధాన కారణం అతివేగం డ్రైవర్ నిద్ర మత్తు అని పోలీసులు అనుమనిస్తున్నారు. అయితే.. ఈ కేసులో తాజాగా ఓ షాకింగ్‌ విషయం బయటకు వచ్చింది.

mla-lasya-nadhitha

ఔటర్ రింగ్ రోడ్ రహదారిపై కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ఢీకొన్న ఘటనలో టిప్పర్ ను గుర్తించారు. దింతో టిప్పర్ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు పోలీసులు. నిద్రమత్తులో టిప్పర్ను లాస్య నందిత డ్రైవర్ ఆకాష్ ఢీ కొట్టారట. టిప్పర్ ఢీకొనడంతో ఘటనలో లాస్య నందిత మృతి చెందారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news