ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ ప్రధాని కాకపోతే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి అయోధ్యకు వెళ్లే దమ్ము లేదంటూ విమర్శలు చేశారు. వాళ్ళు అయోధ్యకు వెళ్తే నేను తల నరుక్కుంటాను అంటూ సవాల్ చేశారు ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి.
బీజేపీ ప్రజల చేత స్థాపించబడింది… ప్రజల కోసం, ప్రజల చేత నడిచే పార్టీ.. బీజేపీ కుటుంబ పార్టీ కాదన్నారు. ఎవరైన ఆర్థిక సహాయం చేయాలని అనుకుంటే నమో యాప్ ద్వారా చేయండని కోరారు. ప్రధాని 4,5 తేదీల్లో తెలంగాణ కి వస్తున్నారని తెలిపారు. అనేక అభివృద్ది కార్యక్రమాలకు శంఖుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారన్నారు ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి.