సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్ చెప్పిన టిఎస్ ఆర్టిసి.ప్రయాణికుల సౌకర్యార్థం లహరి ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సుల్లో బెర్త్‌లపై 10 శాతం రాయితీ కల్పించాలని టిఎస్ ఆర్టిసి యాజమాన్యం నిర్ణయించింది. సాధారణ టికెట్ ధరలో ప్రయాణికులు బుక్ చేసుకునే బెర్త్‌లపై 10 శాతం డిస్కౌంట్‌ను కల్పించింది.
లహరి ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులు తిరిగే అన్ని రూట్లలోనూ ఏప్రిల్ 30 వరకు డిస్కౌంట్ అమల్లో ఉంటుంది అని పేర్కొంది.లహరి ఏసీ స్లీపర్ బస్సులు హైదరాబద్ నుంచి చెన్నై, తిరుపతి, వైజాగ్, బెంగళూరు రూట్లలో నడుస్తుండగా.. లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ సర్వీసులు హైదరాబాద్ నుంచి అసిఫాబాద్, మంచిర్యాల,ఆదిలాబాద్, నిర్మల్ కు,కరీంనగర్-బెంగళూరు,గోదావరిఖని-బెంగళూరు,వరంగల్-బెంగళూరు,నిజామాబాద్ -బెంగళూరు, నిజామాబాద్ -తిరుపతి రూట్లలో తిరుగుతున్నాయి. ఈ రూట్లలో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు 10 శాతం రాయితీని వినియోగించుకుని, టీఎస్ఆర్టీసీ బస్సుల్లో క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని టిఎస్ ఆర్టిసి సంస్థ కోరుతోంది.