-

టీమిండియా యువ బ్యాట్స్ మెన్ యశస్వి జైశ్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం పనిలేదు. జట్టులో స్థానం పొందిన కొన్నాళ్లకే పూర్తి స్థాయి ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జైస్వాల్ ఇంగ్లాండ్‌ తో జరుగుతున్న టెస్టుల్లో చెలరేగి ఆడుతున్నాడు. దీంతో యశస్వీ జైస్వాల్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో సత్తా చాటారు.దీంతో టెస్టు బ్యాట్స్మన్ ర్యాంకింగ్స్ లో 12 నుంచి 10వ స్థానానికి యశస్వీ జైస్వాల్ చేరుకున్నారు . అరంగేట్రం చేసిన ఏడాదికే జైస్వాల్ ఈ ఘనత సాధించడం విశేషం. ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 11వ స్థానానికి, విరాట్ కోహ్లీ 8వ స్థానానికి చేరారు. బౌలర్లలో బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ తొలి రెండు స్థానాల్లో, రవీంద్ర జడేజా 7వ ర్యాంకులో ఉన్నారు.

వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో డబుల్ సెంచరీ చేయడమే కాకుండా,రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగి 236 బంతులలో జైస్వాల్ 14 ఫోర్లు, 12 సిక్సులతో 214 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు.

Read more RELATED
Recommended to you

Latest news