హాలీవుడ్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ కి ఎంత ఫాన్స్ ఉన్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు డీసీ కి కూడా అంతే ఫ్యాన్స్ ఉన్నారు. అలా డీసి సినిమాటిక్ యూనివర్స్ నుండి సూపర్ హీరో మూవీస్ గా వచ్చిన ఫ్రాంచెస్ లో వండర్ ఉమెన్ కూడా ఒకటి. 2017 లో వచ్చిన ఈ సినిమా ద్వారా హాలీవుడ్తో యావత్ ప్రపంచానికి వండర్ ఉమెన్ గా మారింది నటి గాల్ నటనతో గ్లామర్ తో యాక్షన్ సీక్వెన్స్ తో అదరగొడుతూ ఉంటుంది. తాజాగా తన నాలుగవ కూతురికి జన్మనిచ్చింది.
సోషల్ మీడియాలో తన పాప ఫోటోని షేర్ చేస్తూ ఈ విషయాన్ని ప్రకటించింది అభిమానులు ప్రేక్షకులు ఈమె నాలుగో బిడ్డకి జన్మనివ్వడాన్ని చూసి షాక్ అవుతున్నారు మళ్ళీ ప్రెగ్నెంట్ అయిన విషయం ఎవరికీ పెద్దగా తెలియదు. ఇప్పుడు ఒక్కసారిగా నాలుగవ బిడ్డ అనేసరికి అందరూ షాక్ అవుతున్నారు హాస్పిటల్ బెడ్లో పాపని ఎత్తుకొని ప్రేమగా ముద్దడుతున్న ఈ ఫోటో వైరల్ గా మారింది ప్రతి ఒక్కరు కూడా ఈ ఫోటోని షేర్ చేస్తున్నారు. గాల్ ఈ సందర్భంగా తన సోషల్ మీడియాలో ఖాతాలో పోస్ట్ చేసింది.