డిసెంబర్​ నాటికి అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తి

-

అయోధ్యలో కొలువైన బాలక్ రాముడి ఆలయ సముదాయ నిర్మాణాన్ని అధికారులు ముమ్మరం చేశారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి ఆలయ నిర్మాణం పూర్తవుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వెల్లడించింది. ప్రస్తుతం 1,500 మంది కార్మికులు ఆలయ నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నారని ట్రస్టు సభ్యుడు అనిల్‌ మిశ్ర తెలిపారు. త్వరలో మరో 3,500 మందిని అదనంగా నియమించుకోనున్నట్లు  పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఆలయ నిర్మాణ కమిటీ సమావేశం ఈ మేరకు నిర్ణయించిందని చెప్పారు. కార్మికుల సంఖ్య పెంపుతో ఆలయంపై రెండు అంతస్తుల పనులను వేగవంతం చేస్తామని వెల్లడించారు.

‘గర్భగుడి ఉన్న మొదటి అంతస్తు నిర్మాణం గతేడాది డిసెంబరు నాటికే పూర్తయిన విషయం తెలిసిందే. మొత్తం ఆలయంలో అయిదు శిఖరాలు ఉండగా 161 అడుగుల ఎత్తుతో ఉండే ప్రధాన శిఖరానికి బంగారు తాపడం చేస్తున్నాం. వర్షాకాలం మొదలయ్యేలోపు ప్రహరీ నిర్మాణం పూర్తవుతుంది. రామాలయం కింది అంతస్తులో గర్భగుడి ఉందని, మొదటి ఫ్లోర్​లో రామయ్య ఆస్థానాన్ని ఏర్పాటు చేస్తాం. ఆలయ ప్రధాన గోపురం, మరో గోపుర పనులు శరవేగంగా జరుగుతున్నాయి.’ అని అనిల్ మిశ్ర తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news