భారత్ తో వివాదం వేళ.. మాల్దీవులు మరో కీలక నిర్ణయం

-

భారత్ తో వివాదం వేళ మాల్దీవులు మరో కీలక నిర్ణయం తీసుకుంది. క్రమంగా చైనా పంచన చేరుతూ భారత వ్యతిరేక వైఖరికి మరింత పదును పెడుతోంది. ఇప్పటికే తమ భూ భాగం నుంచి భారత సైనికులను పంపించేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా మరో ముందడుగు వేసి భారత్‌ అందజేసిన హెలికాప్టర్‌, దాన్ని నిర్వహిస్తున్న సిబ్బందిపై పూర్తి నియంత్రణను తమ చేతుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటన చేసింది.

భారత దళాల ఉపసంహరణపై చర్చలు కొనసాగుతున్నాయని మాల్దీవుల జాతీయ రక్షణ దళం (ఎంఎన్‌డీఎఫ్‌)లోని ‘ప్లాన్స్‌, పాలసీ, రీసోర్సెస్‌ విభాగం’ డైరెక్టర్‌ కర్నల్‌ అహ్మద్‌ ముజుథబ మహమ్మద్‌ తెలిపారు. మే 10వ తేదీ తర్వాత మాల్దీవుల భూ భాగంపై విదేశీ దళాలు ఉండొద్దని అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు ఆదేశించారని గుర్తు చేశారు. మరోవైపు మాల్దీవులకు  అందజేసిన హెలికాప్టర్‌ను నిర్వహిస్తున్న సైనిక సిబ్బంది స్థానంలో సాధారణ పౌర నిపుణుల బృందాన్ని పంపినట్లు భారత్‌ గతవారం రోజున ప్రకటించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news