అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల మహిళలకు గుడ్ న్యూస్ చెప్తూ ట్వీట్ చేశారు. ఆ పోస్టులో మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. దేశం లో మహిళా సాధికారత కి నిలువెత్తు రూపం ఇందిరమ్మ అని దివంగతం ప్రధానమంత్రి ఇందిరాగాంధీని కొనియాడారు. అలానే సాధికారత కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ అభియం పథకం తీసుకువచ్చింది అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పథకం అమలు చేస్తామన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి పేద ఇంటి మహిళలకు నెలకి 5000 రూపాయలు ఇస్తామని షర్మిల వెల్లడించారు. మహిళా దినోత్సవం రోజున ఇదే మహిళలకు కాంగ్రెస్ ఇస్తున్న భరోసా అని అన్నారు ఆమె నేడు అభ్యర్థుల ఎంపికలపై అధిష్టానం పెద్దలతో మాట్లాడబోతున్నట్లు చెప్పారు.