వంటగ్యాస్ ధరలను రూ. 100 తగ్గించినందుకు ప్రధానమంత్రి శ్రీ ప్రధాని నరేంద్ర మోడీ గారికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.వంటగ్యాస్ ధరలను తగ్గిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం కోట్లాది కుటుంబాల మీద ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది అని అన్నారు. ముఖ్యంగా మన మహిళామూర్తులకు పెద్దఎత్తున లబ్ది చేకూరుతుంది అని పేర్కొన్నారు. వంటగ్యాస్ ధరలను తగ్గించడం ద్వారా వాటి వినియోగం పెరుగుతుంది. తద్వారా అనేక కుటుంబాలలో పొగరహిత వంటిల్లు సాకారమై, ప్రజలు ఆరోగ్యకరమైన జీవితాన్ని సాగిస్తూ సంతోషంగా ఉంటారు. మహిళల సాధికారత మీద, వారి జీవితాన్ని సులభతరం చేయడం మీద నరేంద్రమోదీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం నేటి ఈ నిర్ణయం అని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే…కేంద్రం వంట గ్యాస్ సిలిండర్పై రూ.100 తగ్గించిన సంగతి తెలిసిందే. ఇది నేటి అర్థరాత్రి నుంచి అమల్లోకి రానుంది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో 14.2 కేజీల సిలిండర్ రూ. 855కే లభించనుంది. ఇటీవల కేంద్రం ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద రాయితీని రూ.300కు పెంచడంతో ఈ పథకం లబ్ధిదారులకు సిలిండర్ రూ.555కే దక్కనుంది.