కల్కి నుంచి క్రేజీ అప్డేట్…. భైరవగా ప్రభాస్

-

మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం కల్కి 2898 ఏడీ . సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లో వస్తోన్న ఈ సినిమాని మే 9 న 2024లో రిలీజ్ కానుంది.వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌లో వచ్చి ట్రెండ్‌ సెట్టర్స్‌గా నిలిచిన జగదేకవీరుడు అతిలోక సుందరి, మహానటి చిత్రాలు మే 9 న రిలీజైన సంగతి తెలిసిందే.

ఇక ఈ చిత్రం నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో ప్రభాస్ లుక్ తో పాటు పాత్ర పేరును మేకర్స్ రివీల్ చేశారు. ప్రభాస్ ఫొటోను షేర్ చేస్తూ ఈ చిత్రంలో ప్రభాస్ క్యారెక్టర్ పేరు ‘భైరవ’ అని పేర్కొంది. కాగా ఈ చిత్రం లో అమితాబ్‌, కమల్‌హాసన్‌, దీపిక పదుకొణే, దిశా పటానీ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన పోస్ట‌ర్స్, గ్లింప్స్‌ల‌కు మంచి స్పందన వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news