IND VS ENG : ముగిసిన రెండో రోజు ఆట

-

ధర్మశాల వేదికగా భారత్ ,ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5వ టెస్టులో టీమ్ ఇండియా పట్టు బిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా 8 వికెట్ల నష్టానికి 473 రన్స్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 218 పరుగులకే కట్టడి చేసిన ఇండియా.. ఇప్పటికే 255 రన్స్ ఆధిక్యంలో ఇండియా నిలిచింది. ప్రస్తుతం క్రీజులో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 27, బుమ్రా 19 ఉన్నారు.

రెండో రోజు ఓవర్‌ నైట్‌ స్కోరు 135-1తో బ్యాటింగ్‌ ఆరంభించిన తర్వాత ఇండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ (162 బంతుల్లో 103, 13 ఫోర్లు, 3 సిక్సర్లు), శుభ్‌మన్‌ గిల్‌ (150 బంతుల్లో 110, 12 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీలతో చెలరేగి ఆడారు. ఇక తొలి టెస్టు ఆడుతున్న దేవ్‌దత్‌ పడిక్కల్‌ (103 బంతుల్లో 65, 10 ఫోర్లు, 1 సిక్సర్‌), సర్ఫరాజ్‌ ఖాన్‌ (60 బంతుల్లో 56, 8 ఫోర్లు, 1 సిక్స్‌) లు అర్థ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఇక నిన్న యశస్వి జైశ్వాల్ 57 పరుగులతో రాణించిన సంగతి తెలిసిందే.ఇంగ్లండ్ బౌలర్లలో బషీర్ నాలుగు వికెట్లు,హార్టీ 2 వికెట్ల తో రాణించారు.

Read more RELATED
Recommended to you

Latest news