చెత్త రికార్డు మూట గట్టుకున్న అశ్విన్ ..!

-

ధర్మశాల వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు వందో టెస్ట్ అన్న విషయం తెలిసిందే. ఈ చిరస్మరణీయ మ్యాచ్లో అశ్విన్ ఓ అనవసరపు చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు తీసి బంతితో రాణించిన యాష్.. బ్యాటింగ్ లో నిరాశపరిచి డకౌటయ్యాడు. తద్వారా వందో టెస్ట్లో డకౌటైన మూడో భారత క్రికెటర్ గా, ఓవరాల్ గా తొమ్మిదో ఆటగాడిగా ఘోర అప్రతిష్టను మూటగట్టుకున్నాడు.వందో టెస్ట్లో డకౌటైన తొలి ఆటగాడిగా భారత క్రికెటర్ దిలీప్ వెంగసర్కార్ (1988) రికార్డుల్లోకెక్కాడు. ఆతర్వాత అలెన్ బోర్డర్ (1991), కోట్నీ వాల్ష్, మార్క్ టేలర్ (1998), స్టీఫెన్ ఫ్లెమింగ్ (2006), బ్రెండన్ మెక్ కల్లమ్ (2016), అలిస్టర్ కుక్ (2019), చతేశ్వర్ పుజారా (2023) తమమ వందో టెస్ట్లో ఖాతా తెరవకుండా ఔటయ్యారు.

ఇదిలా ఉంటే, ఐదో టెస్ట్లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా పటిష్ట స్థితిలో ఉంది. తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 473 పరుగులు చేసి, 255 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. కుల్దీప్ యాదవ్ (27), జస్రీత్ బుమ్రా (19) క్రీజ్లో ఉన్నారు. 135/1 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. రోహిత్ శర్మ (103), శుభ్మన్ గిల్ (110) శతకాలతో రెచ్చిపోవడంతో భారీ స్కోర్ చేసింది. వీరిద్దరికి యువ మిడిలార్డర్ బ్యాటర్లు దేవ్ దత్ పడిక్కల్ (65), సర్ఫరాజ్ ఖాన్ (56) తోడవ్వడంతో పరుగుల వరద పారింది. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ (57) కూడా హాఫ్ సెంచరీ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news