తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నాయి. 3 నెలల్లో 25 మంది ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిన్న మరో ఇంటర్ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. హన్మకొండ – భీమారంలోని శివాని జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న సాహిత్య కాలేజీ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
అయితే, సాహిత్య సూసైడ్ చేసుకునే ముందు ఓ లేఖ రాసింది. విద్యార్థిని సాహిత్య ఆత్మహత్యకు ముందు రాసిన లేఖను కేయూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో స్నేహితురాలిని సంబోధిస్తూ.. ‘నీకు చెప్ప కుండా వెళ్తున్నందుకు ఐయామ్ సారీ!.. నీతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎవరూ నిన్ను విడిచి పెట్టలేరే.. యూ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. త్రీ మంత్స్ నుంచి నాకు అసలు మంచిగ అనిపిస్తలేదని లేఖలో పేర్కొంది.
నా మైండ్ అంతా చనిపొమ్మంటోంది. దాని వల్ల అసలు చదువుకోబుద్ది కావడం లేదు. అయినా చదివి ఎగ్జామ్స్ రాసినా.. బోర్డు ఎగ్జామ్స్ ఫస్ట్ సాన్‌స్క్రిట్ పేపర్లో ఒక్క బిట్ రాయలేదే.. ఇంగ్లిష్ ఓకే. బోటనీ అసలు మంచిగా రాయలేదు. ఆన్సర్స్ అన్నీ వచ్చినా కూడా ఏమీ మంచిగా రాయలేదే.. ఇవన్నీ నీకు చెప్పలేదు..’ అని రాసి ఉందన్నారు.