త్వరలోనే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వివాదస్పదమైన ‘పౌరసత్వ సవరణ చట్టం-2019’ ను అమల్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.అయితే కేంద్రప్రభుత్వం తెచ్చిన సిటిజెన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.ఈ చట్టంలో ముస్లింలను మినహాయించడంపై వివాదం రాజకుంది. ఈ చట్టాన్ని అమలు చేయకుండా స్టే విధించాలని కోరుతూ కేరళకు చెందిన ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ చట్టం వల్ల నిర్దిష్ట మతాలకు మాత్రమే పౌరసత్వం దక్కుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.ఇక కేంద్రం అమల్లోకి తెచ్చిన CAAను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా వ్యతిరేకించారు. దీన్ని మత విభజన చట్టంగా అభివర్ణించిన పినరయి విజయన్… తమ రాష్ట్రంలో అమలు చేయబోమని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే….పౌరసత్వ సవరణ చట్టం-2019 కోసం త్వరలో అందుబాటులోకి తెచ్చే పోర్టల్లో పౌరసత్వం కోసం ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం బాధితులను కోరింది.ఈ చట్టం 2014 డిసెంబరు 31 కంటే ముందు ఆఫ్ఘనిస్తాన్ ,పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి.