పవన్ కల్యాణ్ ను ఎర్రగడ్డ ఆస్పత్రిలో వేయాలని..లేకపోతే పిచ్చి ముదురుతుందని భీమవరం MLA గ్రంధి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కామెంట్స్ చూస్తుంటే గురివింద గింజ సామెత గుర్తుకు వస్తుంది..ప్రజా రాజ్యం పార్టీ నాటి నుంచి పవన్ భాష ఏ రకంగా ఉందో అందరికీ తెలుసన్నారు. ఇల్లు కొనడానికి వస్తే… నేను అడ్డుకున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు..పవన్ వస్తే… నాకు ఉన్న 9 ఎకరాల్లో ఎంత కావాలంటే అంత ఇస్తానని ప్రకటించారు భీమవరం MLA గ్రంధి శ్రీనివాస్.
భీమవరం వచ్చి ప్రజలు నీ గురించి ఏమీ అనుకుంటున్నారో ఒక్కసారి పవన్ తెలుసుకోవాలి..నీ అభిమానులకు సెల్ఫీ దిగే అవకాశం కూడా లేదు.. అందుకే నీ నిజ స్వరూపం ఎవ్వరికీ తెలియడం లేదని ఫైర్ అయ్యారు భీమవరం MLA గ్రంధి శ్రీనివాస్. 24 సీట్లకు పరిమితం అయ్యి చంద్రబాబు మోచేతి నీళ్ళు పవన్ కళ్యాణ్ తాగేందుకు సిద్ధం అయ్యారు..24 సీట్లకు ఒప్పుకుని ఇప్పుడు 21 సీట్లు అంటున్నారని ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ నుమంచి మానసిక వైదుడుకి, ఎర్రగడ్డ ఆసుపత్రిలో చూపించాలని అనే అనుమానం వస్తుందని చురకలు అంటించారు.