ఇవాళ మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

-

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. లోక్ సభ అభ్యర్థుల ఎంపికకై జరిగే కాంగ్రెస్ సీఈసీ సమావేశానికి వీరిద్దరూ హాజరుకానున్నారు.

వారం రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళడం ఇది రెండో సారి. దీంతో రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గెలిచి 3 నెలలు కాలేదు కానీ..10 సార్లు ఢిల్లీకి రేవంత్ రెడ్డి వెళ్లాడని ఫైర్‌ అవుతున్నారు జనాలు.

కాగా,ఆర్టీసీ ఉచిత ప్రయాణం వద్దని బీఆర్ఎస్ వాదిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఫ్రీ బస్ పథకానికి అడ్డేస్తే బీఆర్ఎస్ శ్రేణులపైకి ఆర్టీసీ ప్రగతి రథాలు ఎక్కిస్తామని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ‘సోనియా గాంధీ మాటిస్తే వెనక్కి తీసుకోరు. రాజకీయంగా నష్టపోతామని తెలిసి కూడా రాష్ట్రం ఇచ్చారు అని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు ధన్యవాదాలు తెలిపారు. పదేళ్లు రాష్ట్రంలో మహిళలు కన్నీరు పెట్టుకున్నారు’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news