రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. అధికారంలోకి వస్తే పలు సంక్షేమ కార్యకలాపాలు నిర్వహిస్తామని హామీ ఇస్తున్నారు మహిళలని ఆకర్షించేందుకు కాంగ్రెస్ పూర్తి గా కృషి చేస్తోంది. రాబోతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపించాలని, తమ పార్టీ అధికారం లోకి రాగానే పేద కుటుంబంలోని ప్రతి మహిళకి మహాలక్ష్మి పథకం కింద లక్ష రూపాయలు ఇస్తామని చెప్పింది.
మహిళలకి కేంద్రం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మహిళల సంక్షేమ కోసం నారీ న్యాయ పేరిట మహిళలకి 5 హామీలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఎక్స్పోలో పోస్ట్ చేశారు దేశంలోని మహిళల అభివృద్ధి కోసం నారీ న్యాయ పేరిట కొత్త స్కీము ని తీసుకురాబోతున్నట్లు ఖర్గే చెప్పారు.