అమిత్ షాతో భేటీ.. బీజేపీలోకి కర్నాటక మైనింగ్ కింగ్ ….?

-

కర్ణాటక మైనింగ్ కింగ్, మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మరోసారి హాట్ టాపిక్‌ అయ్యారు. 2022లో భారతీయ జనతా పార్టీకి గుడ్ బై చెప్పి సొంత పార్టీ పెట్టుకున్న గాలి జనార్దన్ రెడ్డి…మరోసారి బీజేపీలో చేరడానికి సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇవాళ ఢిల్లీలో హోమ్ మినిస్టర్ అమిత్ షా తో ఆయన భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగా కలిశానని భేటీ అనంతరం తెలిపారు. అయితే, లోక్ సభ ఎన్నికల వేళ ఒక్కసారిగా ఆయన బీజేపీ పెద్దల వద్దకు రావడం చర్చనీయాంశంగా మారింది.

కాగా, ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ గుర్తు మీద పోటీ చేసిన గాలి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే గా గెలుపొందారు. ఆయన పార్టీని బీజేపీలో విలీనం చేసి.. సార్వత్రిక ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపడానికి కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. గాలి జనార్దన్ రెడ్డి ఒకవేళ బిజెపి పార్టీలోకి వెళ్తే కర్ణాటకలో బిజెపి బలం ఇంకాస్త పెరిగే అవకాశాలు ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news