ఏపీలో రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఖరారు.. అధికారికంగా ప్రకటన

-

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారాయి. ఓవైపు అధికార వైసీపీ.. మరోవైపు టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య రసవత్తరంగా పోటీ నెలకొంది.ఈ తరుణంలోనే మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా బరిలో ఉన్నామని సంకెతాలు ఇస్తుంది. ఇటీవలే ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల ఎంపికయ్యారు. ఆమె అధ్యక్షురాలుగా కొనసాగుతున్నప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేపడుతూ ఏపీలో పార్టీని బలోపేతం వైపు కృషి చేస్తోంది. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ చివరిసారిగా అధికారంలోకి వచ్చింది. 

రాష్ట్ర విభజన తరువాత ఏపీలో 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరా పరాభవం ఎదుర్కొంది.  ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది.  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోయే సభ ఖరారు అయింది. ఈ నెల 16వ తేదీన స్టీల్ ప్లాంట్ లో బహిరంగ సభ జరుగనుందని ఏపీ మాజీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు ప్రకటించారు.

గురువారం రుద్రరాజు మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని తెలిపారు. కేంద్రం కుట్రను అడ్డుకునేందుకు ఎంత వరకైనా పోరాటం చేస్తామని ప్రకటించారు. అతి త్వరలోనే కాంగ్రెస్ అభ్యర్థులను కూడా ప్రకటిస్తామని అన్నారు. చాలా మంది కీలక నేతలు కాంగ్రెస్తో టచ్ ఉన్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకానందా రెడ్డి కుటుంబం కాంగ్రెస్ లోకి వస్తామంటే స్వాగతం పలుకుతామని ఆహ్వానించారు.

Read more RELATED
Recommended to you

Latest news