బుట్టబొమ్మ పాటకు హాలీవుడ్ సింగర్ స్టెప్పులు.. వీడియో వైరల్

-

ప్రముఖ హాలీవుడ్ సింగర్ ఎడ్ షీరన్ మరోసారి భారత్లో పర్యటిస్తున్నాడు. గత మూడ్రోజుల నుంచి ఇండియాలో ఉన్న ఆయణ్ను పలువురు బాలీవుడ్ ప్రముఖు కలుస్తున్నారు. ఎడ్ షీరన్ పలు మీడియాలకు ఇంటర్వ్యూలు కూ డా ఇస్తున్నాడు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన ఎడ్ షీరన్ ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రశంసలు కురిపించాడు. నిడివి 3 గంటలు ఉన్నప్పటికీ అద్భుతమైన సినిమా అని కొనియాడారు. అందులో నాటు నాటు పాట, ఆ పాటపై హీరోలు వేసిన స్టెప్పులు అదుర్స్ అంటూ ప్రశంసించారు.

మరోవైపు షీరన్ రీసెంట్గా అల్లు అర్జున్- పూజా హెగ్డే అల వైకుంఠపురంలో ‘బుట్ట బొమ్మ’ పాటకు డాన్స్ చేశారు. ఆ పాట పాడిన బాలీవుడ్ సింగర్ అర్మాన్ మల్లిక్తో కలిసి ఎడ్ షీరన్ స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చివరో ఎడ్ షీరన్ అర్మాన్తో కలిసి షారుక్ ఖాన్ సిగ్నేచర్ స్టైల్ను రీ క్రియేట్ చేశారు. ఈ వీడియో చూసి నెటిజన్లు తెగ లైక్ కొడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news