దిల్లీలోని ఏపీ భవన్‌ విభజన.. ఏపీకి 11.53, తెలంగాణకు 8.24 ఎకరాలు

-

దిల్లీ నడిబొడ్డున ఎకరా రూ.501 కోట్ల విలువ చేసే 19.781 ఎకరాల ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ భూమిని కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు విభజించింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య 58.32%, 41.68% నిష్పత్తిలో పంచుతూ నిర్ణయం తీసుకుంది. మొత్తం రూ.9,913.50 కోట్ల విలువైన ఈ భూమిలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.5,781.41 కోట్ల విలువైన 11.536 ఎకరాలు, తెలంగాణకు రూ.4,132.08 కోట్ల విలువైన 8.245 ఎకరాలు కేటాయించింది.

విభజన చట్టంలో చెప్పిన సూత్రాలు, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించిన విధానం ప్రకారం కేంద్ర హోంశాఖ ఈ భూమిని రెండు రాష్ట్రాలకు పంపిణీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. రాష్ట్ర విభజన జరిగిన పదేళ్లకు తెలుగు రాష్ట్రాల మధ్య పెద్ద ఆస్తి వివాదం పరిష్కారమైంది. మార్చి 11న జరిగిన ఇరు రాష్ట్రాల అధికారుల సమావేశంలో రెండు ప్రభుత్వాలూ అంగీకరించిన ఆప్షన్‌-జి ప్రకారం భవన్‌ ఆస్తులను విభజించినట్లు హోంశాఖ శుక్రవారం రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది. దీనికి ఏపీ, తెలంగాణ అంగీకరించడంతో భవన్‌ ఆస్తుల పంపిణీని పూర్తయింది.

Read more RELATED
Recommended to you

Latest news