నిజాం నకలునే కేసీఆర్‌ చూపించారు.. అందుకే ప్రజలు తిరగబడ్డారు : సీఎం రేవంత్

-

వారసత్వాన్ని తలపై రుద్దాలని చూసినప్పుడు తెలంగాణ సమాజం ఏకమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని తెలిపారు. కేసీఆర్‌ కుటుంబాన్ని ప్రజలు అధికారం నుంచి దించారన్న ఆయన నిజాం నకలునే కేసీఆర్‌ చూపించారని విమర్శించారు. హైదరాబాద్లో మీట్‌ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంపై కేసీఆర్‌కు నమ్మకం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. ఏనాడు ప్రజల స్వేచ్ఛను కేసీఆర్‌ గౌరవించలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వానికి 100 రోజులు పూర్తయ్యాయన్న ఆయన ధర్నాచౌక్‌లో నిరసనలకు అనుమతులు ఇచ్చామని తెలిపారు.

“1948 సెప్టెంబర్‌ 17కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాగే 2023 డిసెంబర్‌ 3కు చరిత్రలో అంతే ప్రాముఖ్యత ఉంది. 1948 సెప్టెంబర్‌ 17న నిజాం రాచరిక పాలన అంతమైంది. 2023 డిసెంబర్‌ 3న కేసీఆర్‌ పాలన అంతమైంది. మా వారసులే అధికారంలో ఉండాలని నిజాం నవాబు కోరుకున్నారు. అభివృద్ధి చేశాను కాబట్టి నేనే అధికారంలో ఉండాలని నిజాం కోరుకున్నారు. నిజాం లాగే కేసీఆర్‌ కూడా రాచరికాన్ని తేవాలని చూశారు. వారసులను సీఎం చేయాలని కేసీఆర్ అనుకున్నారు.” అని రేవంత్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news