ఆంధ్ర ప్రదేశ్ ని ఎడ్యుకేషన్ హబ్ గా మార్చాం: ప్రధాని నరేంద్ర మోడీ

-

ఆంధ్ర ప్రదేశ్ ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.చిలకలూరిపేటలోని బొప్పూడి వద్ద ఏర్పాటుచేసిన ప్రజాగళం సభ లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. బొప్పూడి సభలో మాట్లాడుతూ.. ‘రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్ మార్చాం .తిరుపతిలో ఐఐటీ, ఐసర్, విశాఖలో ఐఐఎం, ఐఐపీఈ, మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మించాం. విజయనగరం జిల్లాలో జాతీయ గిరిజన వర్సిటీ ఏర్పాటు చేశాం అని గుర్తు చేశారు.

యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకే ఈ సంస్థలను స్థాపించాం’ అని మోడీ పేర్కొన్నారు.

టీడీపి వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ ను ప్రజాగళం సభలో ప్రధాని మోదీ తలచుకున్నారు. ‘శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అనగానే తెలుగునాట నందమూరి తారకరామారావు గుర్తొస్తారు అని గుర్తు చేశారు. పేదల కోసం, రైతుల కోసం ఆయన చేసిన పోరాటాన్ని, అందించిన సేవల్ని మనం కచ్చితంగా గుర్తుచేసుకోవాలి అని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని పదే పదే దెబ్బతీసిన విషయాన్ని మరచిపోకూడదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news