ఆంధ్ర ప్రదేశ్ ప్రజల కోసం చంద్రబాబు, పవన్ రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ‘ప్రజల కోసం వాళ్లిద్దరూ ఎంతో కష్టపడుతున్నారు అని అన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు ఖాయమయ్యాక జరుగుతున్న చిలకలూరిపేటలోని బొప్పూడి వద్ద ఏర్పాటుచేసిన ప్రజాగళం సభ లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….చంద్రబాబు రాకతో ఎన్డీఏ మరింత బలపడింది. డబుల్ ఇంజిన్ సర్కారుతో మన లక్ష్యాలు నెరవేరుతాయి అని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన ఏపీ కావాలంటే.. ఇక్కడ ఎన్డీఏ గెలవాలి అని తెలిపారు. ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ ప్రగతి రెండూ అవసరం. ఈ రెండింటినీ ఎన్డీఏ సమన్వయం చేస్తుంది. అందుకే ఏపీలో ఎన్డీఏ గెలవాలి’ అని ఆకాంక్షించారు.
ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.’రాష్ట్ర మంత్రులు అవినీతి, అక్రమాల్లో పోటీ పడుతున్నారు అని విమర్శించారు. ఒకరికి మించి ఒకరు అవినీతి చేస్తున్నారు. కాంగ్రెస్, వైసీపీ వేర్వేరు కాదు. ఈ రెండూ కుటుంబ పార్టీలే అని ఆరోపించారు . వైసీపీని గెలిపించేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోంది. వైసీపీ అవినీతితో ఆంధ్ర ప్రదేశ్ లో గత ఐదేళ్లు అభివృద్ధి జరగలేదు. రాబోయే 5 ఏళ్లు ఆంధ్ర ప్రదేశ్ కి కీలకం. ఎన్నికల్లో ఓటు చీలకుండా ఎన్డీఏను గెలిపించాలి’ అని విజ్ఞప్తి చేశారు.