దిశ కేసులో కీల‌క సాక్ష్యాలు దొరికాయ్‌… మొబైల్‌ను ఏం చేశారంటే..

-

హైద‌రాబాద్‌కు చెందిన ప్ర‌ముఖ వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ దిశ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో సాక్ష్యాల సేక‌ర‌ణ‌కు శంషాబాద్‌ డీసీపీ నేతృత్వంలో నలుగురు అదనపు ఎస్పీ స్థాయి అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. కేసును విచారించడం, ఆధారాలు సేకరించడం, శాస్త్రీయ ఆధారాల సేకరణ.. ఫొరెన్సిక్‌ ల్యాబ్‌ నుంచి నివేదికలు తెప్పించడంపై కమిటీ దృష్టి పెట్టింది. వీళ్లు మొత్తం ఏడు బృందాలుగా విడిపోయి ఈ కేసు కోసం వివిధ అంశాల్లో ప‌ని చేస్తున్నారు.

ఇక ఈ కేసుకు సంబంధించిన కీల‌క‌మైన సాక్ష్యాల‌ను పోలీసులు కోర్టు ముందు ఉంచి న‌ట్టు తెలుస్తోంది. దిశ హ‌త్య జ‌రిగిన సంఘ‌ట న స్థ‌లంలోనే పోలీసులు స్వాధీనం చేసుకున్న ప‌లు వ‌స్తువుల‌ను పోలీసులు సీల్డు క‌వ‌రులో పెట్టి మ‌రీ కోర్టుకు అంద‌జేసిన‌ట్టు తెలుస్తోంది. దిశ‌పై అత్యాచారం జ‌రిగిన టోల్ గేట్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో దిశకు సంబంధించిన పర్సు, డెబిట్ కార్డు, చున్నీ, లాకెట్, ఐడీ కార్డు, లోదుస్తులు, జీన్ ఫ్యాంట్, చెప్పులను ఘటన జరిగిన మరుసటి రోజే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇక ఇప్పుడు దిశ ఫోన్ ను నిందితులు ఓ చోట పాతి పెట్టిన విష‌యం గుర్తించారు. ఈ సెల్ ఫోన్ ద్వారా దిశ మాట్లాడిన కాల్స్ తో పాటు ఆమె కాల్ రికార్డింగులు కూడా ఏమైనా కేసుకు ప‌నికి వ‌స్తాయా ? అన్న కోణంలో కూడా విచార‌ణ చేస్తున్నారు. ఇక న‌లుగురు నిందితుల విష‌యానికి వ‌స్తే వారం రోజుల కస్టడీలో భాగంగా నిందితులను విచారించి వారి వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేయనున్నారు. సీన్ టూ సీన్ మొత్తం వివరాలను నిందితుల నుంచి పోలీసులు రాబట్టనున్నారు.

దిశ‌పై అత్యాచారం చేసిన వెంట‌నే ఆమెను ఎందుకు త‌గుల బెట్టారు ? అనే విష‌యంలో కూడా నిందితులు ఈ సారి స‌రికొత్త విష‌యాలు బ‌య‌ట పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఆమె చివ‌ర్లో స్కూటీ పంక్చ‌ర్ వేయించేందుకు వెళ్లిన నిందితుడితో ఆరు నిమిషాలు ఏం మాట్లాడింది ? అనే దానిపై కూడా విచార‌ణ చేస్తున్నారు. ఏదేమైనా ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడంతో.. నిందితులకు కఠిన శిక్ష పడేలా ఆధారాలు సేకరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news