సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నఎమ్మెల్సీ కవిత

-

దిల్లీ లిక్కర్ కేసులో రోజురోజుకు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టయిన విషయం తెలిసిందే. అయితే ఆమె గతంలో ఈడీ సమన్లు జారీ చేసిన తర్వాతే సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. గతేడాది మార్చి 14వ తేదీన దాఖలు చేసిన ఈ పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరపాల్సి ఉంది.

అయితే తాజాగా కవిత.. సుప్రీంకోర్టులో వేసిన రిట్‌ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. ఈడీ సమన్లు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ఆమె ఉపసంహరించుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో రిట్‌ పిటిషన్‌పై విచారణ అవసరం లేనందున వెనక్కి తీసుకుంటున్నామని కవిత తరఫు సీనియర్‌ న్యాయవాది విక్రమ్‌ చౌదరి తెలిపారు. దీనికి జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ ధర్మాసనం అనుమతించినట్లు చెప్పారు. తాము చట్ట ప్రకారం ఉపశమనం పొందేందుకు తదుపరి చర్యలకు వెళ్తామని న్యాయవాది విక్రమ్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news