కాంగ్రెస్, BRS కు మాదిగలు ఓట్లు వేయవద్దు – మందకృష్ణ మాదిగ

-

కాంగ్రెస్, BRS కు మాదిగలు ఓట్లు వేయవద్దంటూ MRPS జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు మాదిగల పట్ల నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నాయి..తెలంగాణ లో షెడ్యూల్ కులాల జనాభ లో 75 శాతం మాదిగలే అన్నారు. కాంగ్రెస్, BRS మాదిగలకు సీట్లు కేటాయించడంలో అన్యాయం చేశాయని ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్, BRS లో మాదిగలకు భవిష్యత్తు లేదు..కాంగ్రెస్, BRS కు మాదిగలు ఓట్లు వేయవద్దని కోరారు.

రేవంత్ రెడ్డి తన గెలుపునకు రెడ్ల కన్నా మాదిగలు సపోర్ట్ ఎక్కువగా ఉందని గతంలో అన్నారు… కానీ మాదిగలకు మాత్రం న్యాయం చెయ్యడం లేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కి భయం పట్టుకుంది… మాదిగల వల్ల సీట్ పోతుందని భయపడుతున్నారు…మాదిగలను నమ్మించడానికి అలా మాట్లాడుతున్నారు… కానీ నిజంగా మాదిగల మీద ప్రేమ లేదని ఫైర్‌ అయ్యారు. మాదిగల వైపు ఉన్నాడనీ తెలిస్తే తన cm కుర్చీకి ఎసరువస్తుంది అని భయం అంటూ వ్యాఖ్యలు చేశారు MRPS జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ.

Read more RELATED
Recommended to you

Latest news