ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష రద్దుపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్న వారు కొనసాగుతారని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష రద్దుపై తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.

పరీక్ష రద్దుపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలను డివిజన్ బెంచ్ లో సవాలు చేసింది ఏపీపీఎస్సీ. ఈ తరుణంలోనే.. ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్న వారు కొనసాగుతారని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఉద్యోగులు కొనసగవచ్చని పేర్కొంది హైకోర్టు.