ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి దగ్గర హైటెనషన్ వాతావరణం నెలకొంది. కేజీవాల్ను ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈడీ ఆఫీసుకు వెళ్లేందుకు కేజీవాల్ నిరాకరించారు. ఇంట్లోనే ప్రశ్నించాలని ఆయన కోరారు.సెర్చ్ వారెంట్ తో కేజ్రీవాల్ ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ ఫోన్,ఆయన భార్య ఫోన్లను సీజ్ చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి నివాసానికి వచ్చే అన్ని దారులను పోలీసులు మూసివేశారు. ఇప్పటికే అక్కడికి చేరుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేతలు ధర్నాకు దిగారు. కాసేపట్లో ఆయనను అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే… ఢిల్లీ సీఎం నివాసంలో ఈడీ సోదాలు చేయడంపై ఆప్ నేతలు మండిపడ్డారు. సీఎంను లొంగదీసుకునేందుకు బీజేపీ ఎన్నో అడ్డదారులు తొక్కుతోందని ఆరోపించారు .ఈ చర్యలను ఢిల్లీ ప్రజలు గమనిస్తున్నారని, వాళ్లు మౌనంగా ఉండరని వార్నింగ్ ఇచ్చారు.ఈడీ అరెస్టు చేయకుండా తనకు రక్షణ కల్పించాలని చేసిన అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.