విశాఖ పోర్టులో 25వేల కిలోల డ్రగ్స్ దొరికింది. సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ కేంద్రంగా భారీ డ్రగ్స్ దందా జరిగినట్లు పోలీసులు గుర్తించారు. బ్రెజిల్ నుంచి కంటైనర్లో విశాఖ పోర్టుకు.. ఇంటర్‌పోల్ సమాచారంతో సీబీఐ తనిఖీలు చేసింది. ఈ తరుణంలోనే.. 25 వేల కిలోల డ్రై ఈస్ట్‌తో కలగలిపి కొకైన్ దిగుమతి జరిగినట్లు గుర్తించారు.. సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ పేరిట డెలివరీ అయినట్లు అధికారులు తేల్చారు.
ఈ కంపెనీ సీఈఓ కూనం కోటయ్య చౌదరి.. ఆయన తండ్రి వీరభద్రరావు ఎండీగా గుర్తించారు. బీజేపీ నేత పురందేశ్వరి కుటుంబీకులకు వీరభద్రరావు వ్యాపార భాగస్వామి.. టీడీపీ నేతలతోను, బాలకృష్ణ వియ్యంకుడి కుటుంబంతోనూ సాన్నిహిత్యం ఉన్నట్లు సమాచారం. టీడీపీ హయాంలో అక్రమాలకు ‘సంధ్యా ఆక్వా’ తెగపడ్డట్లు చెబుతున్నారు. అయితే.. ఈ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కొరడా విధించింది. ఈ కంపెనీని సీజ్ చేసింది పీసీబీ. 2016లో అమెరికాలో విమాన ప్రయాణికురాలితో వీరభద్రరావు అసభ్య ప్రవర్తనపై కేసు నమోదు అయింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలోనూ పాత్ర ఉన్నట్లు గుర్తించారు అధికారులు.