ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు

-

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన ఎమ్మెల్యే ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన ఎన్నికల పిటిషన్‌పై వివరణ ఇవ్వాలంటూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ తరఫున ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఈయనపై పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి విజయా రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఈ వ్యాజ్యంపై జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డి విచారణ చేపట్టారు.

ఎన్నికల సమయంలో దానం నాగేందర్ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ డబ్బులు పంచిపెట్టారని పిటిషనర్ తరఫు న్యాయవాది సుంకర నరేష్ కోర్టుకు వివరించారు. డబ్బుల పంపకానికి సంబంధించి పలు పోలీస్‌ స్టేషన్లలో కేసులు కూడా నమోదు అయ్యాయని తెలిపారు. ప్రజా ప్రాతినిధ్య చట్టానికి ఇది పూర్తి వ్యతిరేకమని పేర్కొన్నారు. దానం నాగేందర్ తన భార్యకు సంబంధించిన ఆస్తి వివరాలను నామినేషన్ పత్రాల్లో పేర్కొనలేదని వెల్లడించారు. వాదనలు విన్న హైకోర్టు వివరణ ఇవ్వాలంటూ దానం నాగేందర్‌కు నోటీసులు జారీ చేస్తూ విచారణను వచ్చే నెల 18వ తేదీకి వాయిదా వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news