ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2024 అట్టహాసంగా ప్రారంభమైంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో నిర్వహించిన ఓపెనింగ్ సెర్మనీ ఆకట్టుకుంది. బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ షాఫ్ డాన్సులతో అల్లరించగా, ఏఆర్ రెహమాన్, సోను నిగమ్ పాటలతో ఉర్రూతలూగించారు. కళ్లు జిగేల్మనిపించే లైట్లు, లేజర్ షోలు, బాణసంచా విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మరి కాసేపట్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా తొలి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రాత్రి 8 గంటల నుంచి జరగనుంది.