ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి ఒక రోజున ఎర్త్ అవర్ అని పాటిస్తున్నారు. వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన పెంచేందుకే ఈ రోజును జరుపుకొంటున్నారు. ఇవాళ అనగా మార్చి 23న రాత్రి 8.30 నుంచి 9.30 వరకు గంటపాటు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆ సమయంలో ఒక గంటపాటు అవసరం లేని లైట్లు ఆఫ్ చేయాలి. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో 2007లో ఎర్త్ అవర్ అనే కాన్సెప్ట్ పుట్టింది. దీనిని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ప్రారంభించింది.
వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఒక గంట పాటు లైట్లు ఆఫ్ చేయాలని చెప్పింది. అప్పటి నుంచి దీన్ని కొనసాగిస్తున్నారు. దీన్ని అందరూ స్వాగతించారు. 190 దేశాలకు పైగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఎర్త్ అవర్లో భాగంగా ఒక గంట పాటు విద్యుత్ వినియోగం తగ్గుతుంది. దాని వల్ల భూమిపై వాతావరణ మార్పులలో తెడాలు గమనించవచ్చు. అంతే కాదు.. ప్రపంచం అంతా ఒక పనిని చేసినట్లు స్పూర్తిగా ఉంటుంది. ఎర్త్ అవర్లో పాల్గొనాలంటే ఇవాళ రాత్రి 8.30 నుంచి గంటపాటు అంటే 9.30 వరకు అవసరం లేని లైట్లు, విద్యుత్ ఉపకరణాలను ఆఫ్ చేయాలి.