ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. కుమార్తె సహా దంపతులు పద్మావతి, సుబ్బారావు బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానిక తహశీల్దార్, రెవెన్యూ అధికారులే తమ సూసైడ్ కి కారణమని లెటర్ రాసి మరీ దారుణానానికి పాల్పడ్డారు.
తమకు చెందిన 10 ఎకరాల భూమిని వేరే వారి పేరు మీదకు మార్చారని ఆవేదన చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు లెటర్ లో పేర్కొన్నారు. స్థానికుల సమాచారం తో విషయం తెలుసుకున్న పోలీసులు హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతులు కడప జిల్లాలోని ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం గ్రామంగా గుర్తించారు. ముఖ్యంగా రెవెన్యూ అధికారులు ఆన్లైన్ చేసే విషయంలో వేధింపులకు గురి చేశారని.. దీంతో మనస్తాపం చెంది భార్య, భర్త, కూతుళ్లు బలవర్మరణానికి పాల్పడినట్టు సమాచారం. తల్లికూతురు ఉరెసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనకి సంబంధించి త్వరలోనే క్లారిటీ రానుంది.