‘దేవర’ లో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ ?

-

జూనియర్ ఎన్టీఆర్‌తో కొరటాల శివ తీస్తున్న భారీ బడ్డెట్ చిత్రం ‘దేవర’.  రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యుయెల్ రోల్‌లో కనిపిస్తారని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే ఇప్పటివరకూ రిలీజ్ చేసిన లుక్స్, గ్లింప్స్ చూశాకా దేవరలో తండ్రి-కొడుకు పాత్రల్లో ఎన్టీఆర్ నటిస్తున్నారని అనుకున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో మరో కొత్త వాదన మొదలైంది. దేవరలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లుగా పోస్టులు పెడుతున్నారు.

తారక్ ఎలాంటి పాత్రలో అయినా కూడా ఇట్టే ఒదిగిపోతాడు అని తెలిసిందే. అలాంటిది తన నటనా చౌతుర్యనికి విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలు పడితే తన నుంచి క్రేజీ పెర్ఫార్మన్స్ ని కోరుకుంటున్న వారికి మంచి ట్రీట్ దక్కడం ఖాయం అని చెప్పాలి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ లో నటించనున్నట్టు తెలుస్తోంది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. శృతి మరాఠే మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news