KTR : ఆ యూట్యూబ్‌ ఛానళ్లకు కేటీఆర్‌ వార్నింగ్

-

KTR : ఆ యూట్యూబ్‌ ఛానళ్ల కేటీఆర్‌ వార్నింగ్ ఇచ్చారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన యూట్యూబ్ ఛానళ్లు కొన్ని, ఏలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా, అసత్యాలను పదేపదే ప్రసారం చేస్తున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించేలా తంబ్ నెయిల్స్ పెడుతూ, వార్తల పేరుతో శుద్ద అబద్దాలను చూపిస్తున్నాయని ఫైర్‌ అయ్యారు.

BRS party

గతంలో మాపై అసత్య ప్రచారాలను, అవాస్తవాలను ప్రసారం చేసిన, ప్రచురించిన మీడియా సంస్థలపైన కూడా న్యాయపరమైన చర్యలు ప్రారంభించామని వివరించారు. ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తూనే, కుట్రపూరితంగా వ్యవహారం నడిపే యూట్యూబ్ ఛానళ్లు చట్ట ప్రకారం తగిన శిక్షకు సిద్దంగా ఉండాలని హెచ్చరిస్తున్నామని వార్నింగ్‌ ఇచ్చారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news