చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఓటమి కోసం పని చేస్తానని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు తరాలుగా రాజకీయాల్లో ఉన్నాం. నా కొడుకు ఎందుకు రాకూడదని ప్రశ్నించారు. ఒక ఎంపీ, ఎమ్మెల్యే లేకుండా ఎవ్వడు పడితే వాడు పార్టీ పెడితే నేను వెళ్లాలా..? అని ప్రశ్నించారు. చిరంజీవి ఓడిపోయాడు.. పవన్ రెండు చోట్ల ఓడిపోయాడు. ఉద్యమం వల్ల నేను నష్టపోయాను. తాను అమ్ముడు పోయి జనాలకు లక్షలు ఇస్తారని ఎలా చెబుతారు అంటూ అడిగారు.
గత ప్రభుత్వంలో పవన్ ఐదేళ్లు ఏ మడుగులో ఉన్నాడు..? నా శత్రువులతో పవన్ ఎలా కలుస్తాడు. వైసీపీలో చేరకుండా ఉండుంటే పవన్ కళ్యాణ్ పై పీఠాపురంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేవాడిని. పిఠాపురంలో పవన్ కచ్చితంగా ఓడిపోతాడు అని ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. సినిమా వాళ్లు రాజకీయాలకు పనికి రారు అని ముద్రగడ పద్మనాభం తెలిపారు. ప్రత్తిపాడు నుంచి కాపుల కోసం పని చేయడంతో నా రాజకీయ పతనం ప్రారంభమైంది అని తెలిపారు ముద్రగడ.