ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం.. వృద్ధురాలు కాలు నుజ్జు నుజ్జు..!

-

ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యంతో వృద్ధురాలి కాలు నుజ్జునుజ్జు అయింది. నవీపేట్ మండల కేంద్రంలోని బస్టాండ్ లో  ఆర్టీసీ బస్ టైర్ వృద్ధురాలి కాలు పై నుండి పోవడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం మండల కేంద్రానికి చెందిన పుట్టవాతి గంగామని అనే వృద్ధురాలు నవీపేట్ నుండి బాసరకు వెళ్లడానికి నవీపేట్ బస్టాండ్ లో ఆర్టీసీ బస్ ఎక్కుతుండగా డ్రైవర్ నిర్లక్ష్యంతో ముందుకు నడిపాడు. దీంతో వృద్ధురాలి కిందపడిపోయి కాలు బస్ టైర్ కింద పడి నుజ్జు నుజ్జు అయింది.

వెంటనే స్పందించిన స్థానికులు ప్రైవేట్ ఆటోలో నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వృద్ధురాలి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. వృద్ధురాలి మనవడు కిషోర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నవీపేట్ ఎస్సె యాదగిరి గౌడ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news