గెలుపు కోసం చంద్రబాబు వక్రబుద్ధి.. ఎన్నికల్లో లెక్కకు మించి దొంగ ఓట్లు

-

అవినీతి అక్రమాలపై చెడుగుడు ఆడే పాశుపతాస్త్రం.. ఓటు. పరమ పవిత్రమైన ఓట్లు టీడీపీ అధినేత చంద్రబాబు వల్ల పప్పుబెల్లాలు అయ్యాయి. వక్రబుద్ధి మరవని చంద్రబాబు.. తన అనుచరులతో లెక్కకు మించి దొంగ ఓట్లను నమోదు చేయించి.. ఓటు విలువను అభాసుపాలు చేశారు.

దొంగోడి దృష్టి ఎప్పుడూ మూట మీదే ఉన్నట్లు చంద్రబాబు చూపెప్పుడూ పదవిపైనే ఉంటుంది. దానికోసం ఎంతటి దారుణాలకైనా ఆయన సిద్ధంగా ఉంటారు. ఎన్నికల అక్రమాలకు పాల్పడటంలోనైతే చంద్రబాబు ఎప్పుడో పండిపోయారు. ఓట్లను గల్లంతు చేసే నేరాలకు 2019 ఎలెక్షన్లలోనే తెగబడింది టీడీపీ. 2019 జనవరి 11 నుంచి మార్చి మధ్యకాలంలో 12.50 లక్షల ఓట్లను తీసేయాలంటూ ఎన్నికల సంఘానికి ఫాం-7 దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఆ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలోనే ఏకంగా 9.50 లక్షల అర్జీలు పోటెత్తాయి. చంద్రగిరి, రాప్తాడు, గురజాల, భీమిలి, అనపర్తి.. ఇలా పలు నియోజకవర్గాల్లో వేలాది ఓట్ల తొలగింపునకు కుట్రలు సాగాయి.

కానీ ఆ కుట్రను వైసీపీ తిప్పికొట్టింది. ఎన్నికలు పూర్తయ్యి జగన్‌ అధికారంలోకి వచ్చారు. జగన్‌ పాలనలో ఓట్ల తొలగింపు కుట్రదారులపై కేసులు నమోదైయ్యాయి. ప్రజాస్వామ్య వస్త్రాపహరణం చేసిన టీడీపీపై రెట్టించిన ఉత్సాహంతో అక్రమార్కులను జైలు ఊసలు లెక్కపెట్టించారు.

రాత్రిపూట ఊరంతా కన్నాలేసే మనిషి తెల్లారి దొంగతనం మహాపాపం అని జనానికి లెక్చర్లు ఇస్తే ఎలా ఉంటుంది? చంద్రబాబు మాటలు కూడా అటువంటివే. అర్హుడైన ఒక్క ఓటరునైనా జాబితా నుంచి తొలగిస్తే అది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం అని.. అవినీతి జాతిరత్నమైన చంద్రబాబుకు తెలియదా..? పోటీదారు కంటే ఒక్క ఓటు ఎక్కువ వస్తే చాలు- అతన్నే విజేతగా ప్రకటించే ఎన్నికల విధానం మనది. కాబట్టి అర్హులైన ఓటర్లలో ఒక్కరిని తీసేసినా, ఒక్క బోగస్‌ ఓటును చేర్పించినా ఫలితాలే తారుమారవుతాయి. దీని కోసం చంద్రబాబు వ్యూహాలు, ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం తొక్కకూడని దారులన్నీ తొక్కుతున్నారు. ఎలాగైన అధికారం కాపాడుకోవాలంటూ అపసోపాలు పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news