కోడంగల్ కి సీఎం రేవంత్ రెడ్డి చేసింది ఏమి లేదు : కేటీఆర్

-

మల్కాజ్ గిరి పార్లమెంట్ నియెజకవర్గానికి  సీఎం రేవంత్ రెడ్డి చేసింది ఏమి లేదు కేటీఆర్ పేర్కొన్నారు. మల్కాజ్ గిరి ఎంపీ లక్ష్మారెడ్డికి మద్దతుగా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు అమలు చేయలేదు.. కానీ కాళేశ్వరం, బర్ల స్కామ్, గొర్ల స్కామ్, ఫోన్ ట్యాపింగ్ అంటూ 6 గ్యారెంటీలను పక్క దోవ పట్టించారని పేర్కొన్నారు. 

ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ విషయానికి వస్తే.. ఒరిద్దరి ఫోన్లు ట్యాపింగ్ చేయవచ్చు.. ఏకంగా  పదిలక్షల ఫోన్లు ట్యాపింగ్ చేశారని పేర్కొనడం ఆశ్చర్యంగా ఉందన్నారు.  రైతుబంధు, పెన్షన్ డైవర్ట్ చేయాలని.. ఫోన్ ట్యాపింగ్ తెరపైకి తీసుకొచ్చారని పేర్కొన్నారు.  రేవంత్ రెడ్డి గారు సీఎంగా మీరే ఉన్నారు.. చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో అన్నారు కేటీఆర్.  సీఎం లీకు వీరుడు.. రైతులు ఆగమవుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కోడంగల్ కి సీఎం రేవంత్ రెడ్డి చేసింది ఏమి లేదు. కోడంగల్ కి రాజీనామా చేసి రా.. నేను సిరిసిల్ల రాజీనామా చేసి వస్తా.. మల్కాజ్ గిరిలో పోటీ చేద్దాం.. ఎవ్వరూ గెలుస్తారో చూద్దాం అని సవాల్ విసిరారు కేటీఆర్. 2019లో కార్యకర్తలు కష్టపడి ఎంపీ రంజిత్ రెడ్డిని గెలిపించారు. కానీ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు. 

Read more RELATED
Recommended to you

Latest news